కోలుకుంటున్న లతా మంగేష్కర్
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింతగా మెరుగైంధి. ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో సోమవారం ఆమెని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.
కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతామంగేష్కర్ ఆరోగ్యం ఇప్పుడు మరింత మెరుగు పడిందని ఆమె అధికార ప్రతినిధి తెలిపారు.
మీ ప్రార్ధనల వల్ల ఆమె చాలా స్పీడ్‌గా రికవర్ అవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు లత వేగంగా కోలుకోవాలంటూ బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, హేమమాలిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.