ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉత్తర కాశీలో విషాదం.. పిడుగుపాటుకు 300 మేకలు మృతి

goats
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 300 మేకలు మృతి చెందాయి. ఇంత భారీ సంఖ్యలో మేకలు చనిపోవడంట ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 
 
ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అనే అటవీ ప్రాంతంలో పిడుగు పాటు కారణంగా ఏకంగా 350కి పైగా మేకలు చనిపోయాయి. శనివారం ఈ దుర్ఘటన జరిగింది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తితన స్నేహితుడితో కలిసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరాశీకి తొలుకుని వెళుతున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో 300కి పైగా మేకలు చనిపోయారు. 
 
మరోవైపు, ఈ విపత్తు గురించి తెలుసుకున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించి, నష్టాన్నిఅంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత బాధిత ప్రాంతానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. సాధారణంగా పిడుగుపాటుకు పొలాల్లో మేత మేసే పశువులు చనిపోతున్న సంఘటనలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు మేకలు చనిపోవడం గమనార్హం.