శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:31 IST)

జూన్‌ వరకు లాక్‌డౌన్‌?

దేశాన్ని స్తంభింపజేసిన లాక్ డౌన్ మరికొన్నాళ్లు కొనసాగనుందా?.. మరో రెండు నెలలు కొనసాగించాలని కేంద్రం భావిస్తోందా?... ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇంతకంటే మరోమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చిందా?..

బీజేపీ నేత మురళీధరరావు మాటలు గమనిస్తే నిజమేనని భావించక తప్పదు. గురువారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ... దేశంలో మరో ఏడాది వరకు బహిరంగ సభలు ఉండకపోవచ్చని, జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తారో లేదో చెప్పలేమని, అన్ని గ్రామాల సర్పంచ్‌లతో శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడతారని పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు జూన్‌ తర్వాత నడిపించడంపై చర్చలు సాగుతున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుంటుందని, ఇప్పటి వరకున్న క్లాస్‌ రూమ్‌ సిస్టమ్‌ ఇకపై ఉండకపోవచ్చన్నారు.