బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (13:50 IST)

ఒకే వరుడు ఇద్దరు యువతులకు తాళి కట్టాడు.. ఎక్కడ..?

Two Women
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకే వరుడు ఇద్దరు యువతులకు తాళికట్టాడు. యువతులిద్దరూ వరుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించడంతో.. ఒకే వేదికపై ఇద్దరు యువతులకు వరుడు తాళి కట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సందీప్ ఉయికే అనే యువకుడు.. భోపాల్‌లో చదువుకునే రోజుల్లో హోశంగబాద్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. 
 
ఇటీవల తల్లిదండ్రులు సందీప్‌కు ఓ సంబంధం చూశారు. తాము చూసిన యువతినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. ఇందుకు సందీప్ నిరాకరించాడు. అయితే, కుటుంబీకులు అతడి అంగీకారం లేకుండానే యువతి కుటుంబానికి మాట ఇచ్చేశారు. దీంతో సందీప్ తన ప్రియురాలిని తప్ప మరెవ్వరినీ మొండికేశాడు. దీంతో యువతి బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు.
 
పెద్దలు సందీప్ ప్రియురాలితో సహా మూడు కుటుంబాలను కుర్చోబెట్టి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సందీప్ ప్రియురాలు, పెద్దలు ఎంపిక చేసిన యువతి అతడితో కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో సందీప్ ఒకే మండపంలో తన ప్రియురాలిని, ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఒకే పెళ్లిలో వరుడు ఇద్దరు యువతులకు తాళి కట్టాడు.