సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (13:13 IST)

శవం వద్ద కూర్చుని మూడు రోజులు ప్రార్థనలు.. పునరుత్థానం కావాలని?

చనిపోయిన మృతురాలు పునరుత్థానం కావాలని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేసిన ఘటన తమిళనాడులోని మదురైలో తీవ్ర కలకలం రేపింది. మదురై కుటుంబీలు శవం వద్ద కూర్చుని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఫాస్టర్లు పాల్గొన్నారు. చనిపోయిన మృతురాలు తిరిగి జీవం పొందాలని ప్రార్థించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన బాలకృష్ణన్ భార్య మాలతి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. 8వ తేదీన మృతి చెందిన ఆమెను ఇంట్లో అంత్యక్రియలు చేయకుండా కుటుంబీకులు ప్రార్థించినట్లు తెలుస్తోంది. 
 
మూడు రోజులు ప్రార్థనలు చేస్తే చనిపోయిన మాలతి బతికి రావాలని కుటుంబీకులు ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు
 
పోలీసులు వచ్చి బాలకృష్ణన్ కుటుంబీకులను హెచ్చరించిన తర్వాతే మాలతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం తిరునల్వేలికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన మధురైలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.