శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (11:01 IST)

మహా వరద విలయం : 150కు చేరిన మృతుల సంఖ్యం

నైరుతి రుతుపవనాలకు తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం కారణంగా మహారాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా మహారాష్ట్రలో వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 149కు చేరింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 149కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 
 
మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిన చెట్లు వరద విలయం కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి తాజాగా మరో 36 మృతదేహాలు బయటపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాయ్గఢ్ జిల్లాలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సతారా జిల్లాలో 41 మంది మరణించారు.