గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:00 IST)

అయోధ్య రామాలయ నిర్మాణం.. ఎక్స్‌లో వీడియో వైరల్

రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ రామమందిరంపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. ఈ రాముని ఆలయం రాబోయే సంవత్సరం జనవరి నాటికి పూర్తవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ట్విట్టర్‌లో పలు ఫోటోలను పోస్ట్ చేశారు.
 
ఇందులో ఆలయానికి సంబంధించిన విగ్రహాలు, రాళ్లు, స్తంభాలు 2002లో నిర్వహించిన ఏఎస్‌ఐ సర్వేలో, రామమందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో బయటపడిన అంశాలను పోస్టు చేశారు. అలాగే ప్రస్తుత రామాలయ నిర్మాణంలోని కొత్త ఆవిష్కరణలు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలను వీడియో ద్వారా పోస్టు చేశారు. ఈ వ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.