శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (12:07 IST)

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

Mallikarjun Kharge
Mallikarjun Kharge
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కర్నాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మల్లికార్జున ఖర్గే స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ఆయన కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నుంచి ఖర్గే అధ్యక్షుడుగా ఎన్నికైనట్టు ధృవీకరిస్తూ ఇచ్చిన సర్టిఫికేట్‌ను స్వీకరించారు. 
 
గాంధీయేతర కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం గత 24 యేళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీలు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ఖర్గే ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు.