ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (12:47 IST)

భార్యను చంపేసి శవం ముందు కూర్చొన్నాడు.. కుమార్తెకు పాలు తాగించి లొంగిపోయాడు

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. అంతే.. భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవం ముందు 24 గంటలపాటు కూర్చుండిపోయాడు. ఆ తర్వాత రెండేళ్ళ కుమార్తెకు పాలు తాగించి పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు. ఈఘటన ఢిల్లీలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ కమలామార్కెట్ ప్రాంత నివాసి అయిన కమిల్ (24) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన రేష్మా అనే యువతిని మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ళ కుమార్తె కూడా ఉంది. 
 
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కమిల్ ఆమెతో వాగ్వాదానికి దిగుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆమెతో పెనుగులాడాడు. చివరకు భార్య ముఖానికి దిండుతో నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. 
 
ఆ తర్వాత తన కూతురితో కలిసి 24 గంటలు భార్య శవం ముందే ఉన్నాడు. అనంతరం కూతురికి పాలు తాగించిన అనంతరం పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.