ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (14:49 IST)

కెప్టెన్ విజయకాంత్ మృతి.. నేతల సంతాపం

vijayakanth
సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ మృతి పట్ల సినీ రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నారు. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. గురువారం మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు, తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, డీఎండీకే కార్యకర్తలకు సంతాపం తెలిపారు. 
 
"ప్రధాని విడుదల చేసిన సంతాప సందేశంలో విజయకాంత్ మృతివార్త ఎంతో బాధకు గురిచేసింది. తమిళ చిత్రపరిశ్రమలో తన నటా ప్రతిభతో లక్షలాది మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. ప్రజా సేవకు అంకితమయ్యారు. ఆయన మృతి తీరని లోటు. ఆయన లేని లోటును భ ర్తీ చేయడం ఎంతో కఠినం" అని పేర్కొన్నారు. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, విశాల్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.