సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (19:01 IST)

షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ రోడ్ షో..

Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షిల్లాంగ్‌లో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని షిల్లాంగ్ రోడ్ షో నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమై రోడ్ షో పోలీసు బజార్‌లో ముగిసింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. 
 
షిల్లాంగ్ రోడ్ షోలో భాగంగా పోలీస్ బజార్ పాయింట్‌లో మేఘాలయ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా వెయ్యి మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 
 
షిల్లాంగ్‌లో ప్రధానికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశామని, నగరంలో వెయ్యి మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు.