మీ చెస్ట్ కొలతలు ఏంటి.. మహిళలను అడుగుతున్న మధ్యప్రదేశ్ సర్కారు
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల చెస్ట్ కొలతలు అడుగుతోంది. మీ చెస్ట్ కొలతలు ఎంటో చెప్పి తీరాల్సిందేనన్న నిబంధన విధించింది. అసలు మహిళల చెస్ట్ కొలతలు అడగాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంమొచ్చిం
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల చెస్ట్ కొలతలు అడుగుతోంది. మీ చెస్ట్ కొలతలు ఎంటో చెప్పి తీరాల్సిందేనన్న నిబంధన విధించింది. అసలు మహిళల చెస్ట్ కొలతలు అడగాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంమొచ్చిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అటవీ సంరక్షకుల పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అటవీశాఖ రేంజ్ అధికారులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ల నియామక నోటిఫికేషన్లో మహిళా అభ్యర్థుల ఛాతి కనీసం 74 సెంటీమీటర్లుగా ఉండాలని, గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల వ్యాకోచించాలని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
నిజానికి గతంలో ఈ తరహా నిబంధన ఉండేది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నాటి ప్రభుత్వం 2008లో రద్దు చేసింది. మూడేళ్ల క్రితం తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో ఈ నిబంధన మళ్లీ వివాదాస్పదమైంది.