1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:09 IST)

ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు : భద్రత జడ్ ప్లస్‌కు పెంపు

mukesh ambani
భారత పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ప్రాణముప్పు పొంచివుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత యేడాది ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించి, ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.

అప్పటి నుంచి ఆయన భద్రతపై విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది. ఈక్రమంలో ఆయనకు 55 మంది సిబ్బందితో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుంత ముఖేశ్ అంబానీకి జడ్ కేటగిరీ కింద భద్రతను కల్పిస్తున్నారు. దీన్ని జడ్ ప్లస్‌కు పెంచారు.

కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ముఖేశ్‌కు 55 మంది భద్రతతో కల్పించనున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్.ఎస్.జి కమాండోలతో పాటు ఇతర పోలీసు అధికారులు ముఖేశ్ వెన్నంటి ఉంటూ భద్రత కల్పిస్తారు.