శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (13:59 IST)

కోడలు పిల్లతో శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ (video)

Ambani
Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం పూట కలియుగ వైకుంఠం శ్రీవారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

Ambani
Ambani
ఈ సందర్భంగా తిరుమల వెంకన్నకు ముఖేష్ అంబానీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు ముఖేష్ అంబానీ. 
mukesh Ambani
mukesh Ambani
 
అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి.. స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుని మండపం వద్ద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. 
mukesh Ambani
mukesh Ambani
 
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తిరుమలను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిఏటా అభివృద్ధి చెందుతూ వుండాలని ఆకాంక్షించారు. తిరుమల వెంకన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని ఆశించారు. 
mukesh Ambani
mukesh Ambani
 
అంతేగాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన అంబానీ.. గజరాజులకు అరటి పండ్లను ఆహారంగా అందించారు. అంబానీ వెంటనే ఆయన కోడలు రాధిక వున్నారు. 
mukesh Ambani
mukesh Ambani


ఆమె కూడా ఏనుగులకు అరటి పండ్లను అందించారు. ఇక శ్రీవారి పర్యటనకు వచ్చిన ముఖేష్ అంబానీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.