ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (10:05 IST)

కుమార్తెను కాటేసిన తండ్రి.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలిక!!

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డపాలిట కామాంధుడయ్యాడు. తన లైంగికవాంఛను తీర్చుకునేందుకు మైనర్ అయిన తన కుమార్తెను లొంగదీసుకున్నాడు. చివరకు కన్నతండ్రి చేసిన ఘాతుకానికి 17 యేళ్ల బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణం ముంబై మహానగరంలోని పంత్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 45 యేళ్ల ఓ వ్యక్తి తన కుమార్తెను గత 2018 మార్చి నెలలో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తరచుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చింది. ఇంత జరిగినా భర్త బాగోతాన్ని అతని భార్య పసిగట్టలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఆ మైనర్ బాలిక ఇటీవల రాజావాడీ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2018 మార్చి నుంచి ఈ ఏడాది జూన్ వరకు తన తండ్రి బెదిరించి అత్యాచారం చేశాడని, దీంతో తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చానని కుమార్తె వైద్యులు, పోలీసులకు చెప్పింది. 
 
కూతుర్ని తల్లిని చేసిన కామాంధుడైన తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376, సెక్షన్ 4,6,8,10,12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్టు చేస్తామని ముంబై పోలీసులు చెప్పారు.