గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (10:21 IST)

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గులను చవిచూడటం ద్వారా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చి బుధవారం స్థిరంగా కొనసాగిన పెట్రోల్ ధర గురువారం మళ్లీ పైకి కదిలింది.

అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.84.18కు చేరింది. డీజిల్ ధర నిలకడగా రూ.80.17 వద్ద కొనసాగింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. 
 
పెట్రోల్‌ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.85.78కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.85.34కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 10 పైసలు పెరుగుదలతో రూ.81.00కు చేరింది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.73.56 వద్ద ఉంది.