శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:13 IST)

హుషారుగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన బంగారం

దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 38,510కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద ట్రేడవుతోంది. గురువారం యూఎస్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ 0.3 శాతం నీరసించగా.. నాస్‌డాక్‌ అదే స్థాయిలో లాభపడింది. ఇక ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా బలపడ్డ సెంటిమెంటు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.
 
అలాగే బంగారం ధరలు రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టాయి. కానీ శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగాయి . మరోవైపు అంతర్జాతీయ మార్కెట‌్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 
 
డాలర్ బలపడటం, అమెరికా మరో ఉద్దీపణ ప్యాకేజీ అంచనాలు సహా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా గోల్డ్ ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా పసిడి కొనేవారికి ఇది సానుకూల సమయమని నిపుణులు అంటున్నారు.