శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (11:51 IST)

రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు.. 18వ తేదీ నుంచి సేల్

Realme
రియల్ మీ తన రెండు బడ్జెట్ ఫోన్లయిన రియల్ మీ సీ12, రియల్ మీ సీ15 స్మార్ట్ ఫోన్లు ఆగస్టు 18వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్ మీ తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. ఈ రెండు డివైస్‌ల్లోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. రియల్ మీ సీ12 గీక్ బెంచ్, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్ సైట్లలో ఇప్పటికే కనిపించింది. 
 
రియల్ మీ సీ15 ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12.30కు జరిగే వర్చువల్ ఈవెంట్లో వీటి లాంచ్ జరగనుంది. రియల్ మీ సీ12, సీ15 ధరలు, రియల్ మీ సీ15 ఇండోనేషియాలో గత నెలలోనే లాంచ్ అయింది. 
 
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో మనదేశంలో లాంచ్ అయిన రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. రియల్ మీ సీ12 ధర దానికంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.