శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

సుశాంత్ సింగ్ గంజాయికి బానిస? : పనిమనిషి నీరజ్ వెల్లడి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధానంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. పైగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. 
 
అయితే, సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముంబై పోలీసులకు సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ ఓ సంచలన విషయం వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ తరచుగా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని నీరజ్ సింగ్ వెల్లడించినట్టు సమాచారం. 
 
'సుశాంత్ సార్ తన ఇంట్లోనే వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవారు. మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లను ఉపయోగించేవారు. సుశాంత్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు నేను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చాను. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయి' అని ముంబై పోలీసులకు నీరజ్ వెల్లడించినట్టు ఆ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.