బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (12:08 IST)

పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం... మోసపోయానంటూ విలపిస్తున్న టీవీ నటి

బుల్లితెర నటిని ఓ పైలెట్ మోసం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడు. చివరికి పెళ్లి మాటెత్తగానే మాట్లాడటం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ బుల్లితెర నటి టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఈమె తన వివాహం నిమిత్తం ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌ తన వివరాలను మోదుచేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన ఓ వ్యక్తి... ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలెట్‌గా పనిచేస్తున్న పరిచయం చేసుకున్నాడు. 
 
అలా వారిద్దరి పరిచయం తొలుత సోషల్ మీడియా మాధ్యమంగా, ఆపై ఫోన్‌కాల్స్ వరకూ సాగింది. పది రోజుల క్రితం, ఆమెను కలవాలని నిందితుడు కోరగా, అంగీకరించిన ఆమె, అతనున్న ప్రాంతానికి వెళ్లింది. ఆపై ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిన పైలెట్, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై నిత్యమూ అదే పని చేసి, ఆపై అతనితో మాట్లాడటం మానేశాడు.
 
చివరకు అతని చేతిలో మోసపోయానని గ్రహించిన ఆ నటి... ఇటీవల అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.