ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (10:37 IST)

దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు.. ఐరాసలో నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. మంగళవారం ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళ

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. మంగళవారం ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. 
 
భారత పర్యటనకు వచ్చిన యూఎన్ సెక్రటరీ జనరల్ బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా రాజ్‌ఘాట్ వద్ద పుష్ప నివాళులు అర్పించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు.. లక్నోలో గాంధీకి నివాళి అర్పించారు.
 
ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా వారు గాంధీకి నివాళులర్పించారు.