నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?
2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో తీర్పు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది, గత నెలలో పాటియాలా కోర్టు వారి రివ్యూ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులుగా తేలిన నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇందుకోసం తీహార్ జైల్లో నాలుగు ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణాన్ని జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ కేసులో దోషులుగా రుజువైన వినయ్, పవన్, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ అనే నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు.
అయితే మరో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ కుమార్తెకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.