ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 జులై 2021 (09:34 IST)

బీజీపీతో పొత్తు లేదు: ఉద్దవ్ ఠాక్రే

శివసేన, బీజీపీలు త్వరలో జతకడతాయన్న వార్తలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన- బీజేపీల మధ్య ఇటీవలికాలంలో స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.

మరోవైపు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ నిరాధార వార్తలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ రెండు రోజుల సమావేశాల అనంతరం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో చేసిన హంగామా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదన్నారు.

కాగా సభాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌పై అనుచితంగా ప్రవర్తించినందున 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.