శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (11:18 IST)

లోక్ సభలో అద్వానీకి కోపమొచ్చింది.. విపక్షాలు సభను అడ్డుకుంటే.. వదిలేస్తారా?

లోక్ సభలో ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడం పట్ల బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఫైర్ అయ్యారు. ఈ అంశంపై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి అనంత‌కుమార్‌పై అద్వానీ మండిప‌డ్డారు. బీజేపీ పార్లమెంటరీ భేటీలోనూ

లోక్ సభలో ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడం పట్ల బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఫైర్ అయ్యారు. ఈ అంశంపై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి అనంత‌కుమార్‌పై అద్వానీ మండిప‌డ్డారు. బీజేపీ పార్లమెంటరీ భేటీలోనూ అద్వానీ సభను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌స‌భ న‌డిచే తీరు ఇదేనా? అని ప్ర‌శ్నించారు. 
 
స్పీక‌ర్‌గానీ, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగానీ లోక్‌స‌భ‌ను న‌డ‌ప‌డం లేద‌న్నారు. సభ దాని ఇష్టం వచ్చినట్లు నడుస్తోందని వ్యాఖ్యానించారు. లోక్ సభలో ప్ర‌తిప‌క్షాలు గంద‌రోగ‌ళం సృష్టించ‌డంతో ఆవేదనకు చెందిన అద్వానీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ప్రతీసారి ప్రజా సమస్యలపై చర్చించనీయకుండా విపక్షాలు గోడుపెడుతున్నాయని చెప్పారు. అద్వానీనీ శాంతిప‌ర‌చ‌డానికి అనంత‌కుమార్ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. తాను ఈ విష‌యాన్ని ప‌బ్లిగ్గానే చెబుతానని, స్పీక‌ర్‌తోనూ మాట్లాడ‌తానని అన్నారు. 
 
మ‌రోవైపు, ప్ర‌తిప‌క్షాల గంద‌రగోళంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ స‌భ‌ను 2 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా ఎందుకు వేయ‌బోరు? అంటూ అద్వానీ ఆగ్ర‌హంగా అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు విపక్షాలు ఎలాంటి ప్రయత్నాలు చేయని నేపథ్యంలో.. సభను అడ్డుకునే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని అద్వానీ అనంతకుమార్‌ను ప్రశ్నించారు.