ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (07:10 IST)

ఆకాశంలో నో ట్రాఫిక్.. విమానాశ్రయాల్లో నో ఖాళీ

కరోనా వైరస్​ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఆపేశాయి. ఎక్కడి విమానాలను అక్కడే నిలిపివేశాయి. అత్యంత రద్దీగా ఉండే దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయం సహా ఇతర ఎయిర్​పోర్టులు పార్క్​ చేసిన విమానాలతో నిండిపోయాయి.

తాజాగా..ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీ అయిన పోయిన విషయం మనం చూస్తున్నాం. అయితే గగనతలంలోనూ అవే దృశ్యాలు సాక్షత్కారమయ్యాయి. flightradar24.com అనే వెబ్‌సైట్.. గగనతలంలో ఎన్ని విమానాలున్నాయో ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుంది.

వాటి లెక్కలను కచ్చితంగా చెబుతుంది. తాజాగా ఈ వెబ్ సైట్‌లో లభ్యమైన చిత్రాలను చూసిన వారెవరైనా కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రధాని మోదీ ఆంక్షల విధించక మునుపు.. భారత గగనతలమంతా విమానాలతో నిండిపోయింది. ప్రకటన వెలువడిన తరువాత విమానాలు లేక ఆకాశం చిన్నబోయింది.