శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (11:01 IST)

రూ.కోట్ల ఆస్తి కోసం చనిపోయిన తల్లిని ఏం చేశాడంటే...

కొందరు విచక్షణ మరిచి ఆస్తిపాస్తుల కోసం చేయరాని పనులు చేస్తున్నారు. రూ.285 కోట్ల ఆస్తి కోసం ఏకంగా చనిపోయిన తల్లిని బతికివున్నట్టుగా చూపించాడో వ్యక్తి. ఈ విషయం అతని సోదరుడు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
గత 2011 మార్చి నెల ఏడోతేదీన సునీల్ గుప్తా తల్లి కమలేష్ రాణి చనిపోయింది. ఈమె పేరిట ఓ కొవ్వొత్తుల తయారీ కంపెనీ సహా మొత్తం రూ.285 కోట్ల విలువైన ఆస్తివుంది. ఈ ఆస్తిపై కన్నేసిన ఆమె పెద్ద కుమారుడు సునీల్ గుప్తా దానిని తల్లి తన పేరున బదలాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు. 
 
నిజానికి ఆమె చనిపోయిన తర్వాత ఆస్తిని తాము సమానంగా పంచుకోవాల్సి ఉందని, కానీ సోదరుడు సునీల్ దుర్బుద్ధితో ఆస్తిని కాజేయాలని చూశాడు. ఈ విషయం పసిగట్టిన అతని సోదరుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. 
 
విచారించిన కోర్టు సునీల్ గుప్తాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు సునీల్ గుప్తా, ఆయన భార్య రాధ, కుమారులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం జైలుకు తరలించారు.