ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. గాంధీ కుటుంబేతరుడైనా?

priyanka gandhi
priyanka gandhi
సెల్వి| Last Updated: బుధవారం, 19 ఆగస్టు 2020 (13:35 IST)
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై గాంధీ కుటుంబీకులే కాకుండా... ఇతరులు కూడా ఈ బాధ్యతలు చేపట్టవచ్చునని ప్రియాంక గాంధీ కామెంట్లు చేశారు. ఇందుకు తాను సుముఖంగానే ఉన్నానని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఓ కొత్త పంథా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి వక్కాణించారు.

గాంధీ కుటుంబీకుడు కాకపోయినా కాంగ్రెస్ అధ్యక్షుడైతే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ వ్యక్తి 'మీ అవసరం యూపీలో లేదు. అండమాన్ నికోబార్‌లో ఉంది. అక్కడికి వెళ్లండని ఆ కొత్త అధ్యక్షుడు ఆదేశించినా... సంతోషంగా అండమాన్ వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా' అని ప్రియాంకా గాంధీ ప్రకటించారు.

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ''గాంధీ కుటుంబేతరుడు అధ్యక్షుడు అయినా ఓకే.. నాకు ఆమోదమే'' అని రాహుల్ అన్న వ్యాఖ్యలను ప్రియాంక పూర్తిగా సమర్థించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.దీనిపై మరింత చదవండి :