ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (17:30 IST)

త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు.. రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని, రాయబరేలీ సభలో బీజేపీ పార్టీ, ఎన్డీయే సర్కారు విధానాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.  గతంలో ఇందిరాగాంధీ, ఇటీవలి వరకు సోనియాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ఇది తమకు కర్మ భూమి అని పేర్కొన్నారు. 
 
ఈ క్రమంలోనే సభకు హాజరైన కొందరు జనం.. రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ ప్రశ్నించారు. ఇప్పుడిక తాను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదన్నారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ గాంధీ.. ఐదో దశలో ఎన్నిక జరగనున్న రాయబరేలీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.