1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ - రేవంత్

rahul gandhi - revanth
హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌లో నిర్వహించి జనజాతర సభల్లో వారిద్దరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొని ప్రసంగించారు. అయితే, సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. దిల్‌సుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కి సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. 
 
ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో రాహుల్ ముచ్చటించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధించి పాంచ్ న్యాయ్ కరపత్రాలను అందించారు. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణాలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు ఆయన వివరిచారు. ఈ సందర్భంగా రాహుల్, రేవంత్‌లతో ప్రయాణికులు ఫోటోలు దిగారు. 
 
ఇద్దరు భార్యలుంటే జాక్‌పాట్.. యేడాదికి బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు
 
ఇద్దరు భార్యలు ఉంటే జాక్ పాట్ తగిలినట్టేనని కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం మహాలక్ష్మి పథకం కింద గృహిణికి యేడాదికి రూ.లక్ష నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్నారు. అదే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే యేడాదికి రూ.2 లక్షలు జమ అవుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్ర మాజీ మంత్రి అయిన కాంతిలాల్ భూరియా గురువారం ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. పేద మహిళలకు ప్రతి యేటా ఈ పథకం కింద రూ.లక్ష నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. 
 
అదే ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి అయితే, యేడాదికి ఖాతాలో రెండు లక్షలు జమ అవుతాయని అన్నారు. సైలానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పై విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.