ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:55 IST)

'అమ్మాడీఎంకే' పేరుతో కొత్త పార్టీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా దీప.. ధర్మయుద్ధానికి "తయార్''

అన్నాడీఎంకే నుంచి వెలివేసిన తర్వాత పురట్చి తలైవర్ (తిరగుబాటు నాయకుడు) పన్నీర్ సెల్వం రాజకీయ భవితవ్యంపై దృష్టి పెట్టాడు. అన్నాడీఎంకేను ఒక కుటుంబ హస్తంలో పెట్టడం ఇష్టంలేకే తాను నిరసనగా తిరుగుబాటు చేయాల్

అన్నాడీఎంకే నుంచి వెలివేసిన తర్వాత పురట్చి తలైవర్ (తిరగుబాటు నాయకుడు) పన్నీర్ సెల్వం రాజకీయ భవితవ్యంపై దృష్టి పెట్టాడు. అన్నాడీఎంకేను ఒక కుటుంబ హస్తంలో పెట్టడం ఇష్టంలేకే తాను నిరసనగా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అన్నాడీఎంకే పార్టీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ వ్యవహారం నచ్చక పన్నీరు బయటికి వచ్చేశారు. 
 
పన్నీర్ సెల్వంను నమ్ముకుని చిన్నమ్మ శిబిరం నుంచి బైటికొచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరం. బీజేపీ వెన్నుదన్నుతోనే వీళ్లంతా శశికళను ధిక్కరించారన్న వార్తల నేపథ్యంలో.. వీళ్లంతా కమలం గూటికి చేరిపోతారన్న వదంతులూ వ్యాపించేశాయి. కానీ పన్నీర్ సెల్వం మాత్రం.. తనకు, తన దగ్గరుండేవాళ్లకు రాజకీయ భరోసా ఇవ్వడం కోసం.. పన్నీర్ కొత్త పార్టీ ప్లాన్ చేస్తున్నాడన్నది చెన్నైలో వినిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్.
 
జయలలితమీద తమకున్న లాయల్టీని కాపాడుకుంటూ 'అమ్మా డీఎంకే' పేరుతో కొత్త పార్టీ పెట్టాలని పన్నీర్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పన్నీర్ గూటికి చేరిన జయ మేనకోడలు దీపా జయకుమార్.. పన్నీర్ కొత్త పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తారని టాక్ వస్తోంది. ఈ పార్టీ కొద్దిరోజుల తర్వాత బీజేపీలో విలీనమైపోతుందని టాక్ వస్తోంది. 
O Panneerselvam, AIADMK, MLAs, Unite for party, AIDMK, Jayalalithaa