భారతదేశంలోని తమ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఖర్చులను భరించనున్న ఓయో
న్యూఢిల్లీ: చిన్న హోటల్స్ మరియు గృహ యజమానుల కోసం ప్రపంచంలో సుప్రసిద్ధ సాంకేతిక మరియు రెవిన్యూ వృద్ధి వేదిక ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ నేడు భారతదేశంలోని తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఖర్చును భరించనున్నట్లు వెల్లడించింది.
దీనిద్వారా భారతదేశంలో ఏదైనా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఖర్చును పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. దీనితో పాటుగా కంపెనీ ఇప్పుడు కోవిడ్ 19 హోమ్ కేర్ కవర్‌తో పాటుగా పలు ప్రయోజనాలను సైతం ఉద్యోగులకు ప్రకటించింది.
అంతేకాదు, ఏప్రిల్ 2021 నుంచి భారతదేశంలోని ఓయో ఉద్యోగులంతా కూడా తమ జీతాలను ప్రతి నెలా 25వ తేదీ లేదంటే అంతకు ముందే తమ జీతాలను అందుకోగలరు. తద్వారా వారు మరింత ఉత్తమంగా తమ ఆర్థికప్రణాళికలు చేసుకుంటూనే అత్యుత్తమంగా పొదుపు కూడా చేసుకోగలరు.
ఈ ప్రకటనలను గురించి దినేష్ రామమూర్తి, చీఫ్ హ్యుమన్ రిసోర్శెస్ ఆఫీసర్- ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ మాట్లాడుతూ, భారతదేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు ప్రోత్సాహకరంగా ఉంది. మనమంతా కూడా కోవిడ్ 19తో పోరాడి విజయం సాధించేందుకు అత్యుత్తమంగా కృషి చేయాల్సి ఉంది. మా ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల పట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తూనే, వారి పట్ల మా కృతజ్ఞతను వెల్లడించడంలో భాగంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఖర్చును మేము భరిస్తున్నాం. ఉద్యోగులంతా కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు.