శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 మార్చి 2021 (16:53 IST)

కడపలో 18 మందికి కరోనా, అంతా ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు

కరోనావైరస్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వుంటుండంతో వైరస్ దాని పని అది చేసేస్తోంది. విపరీతంగా వ్యాపిస్తోంది. తాజాగా కడప జిల్లాలో 18 మంది ఉద్యోగులకు కరోనావైరస్ సోకడం కలకలం సృష్టిస్తోంది.
 
కడప జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనబడటంతో వారికి టెస్ట్ చేశారు. ఆ పరీక్షలలో నలుగురికీ కరోనా అని నిర్థారణ కావడంతో మిగిలిన 60 మందిని పరీక్షించారు. వారిలో 18 మందికి కరోనా వున్నట్లు తేలింది.
 
దీనితో వారందర్నీ హోంక్వారైటైన్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్టులో వున్నవారిని కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు.