గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:19 IST)

స్కామ్‌లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోం : కాంగ్రెస్‌కు మోడీ వార్నింగ్

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదలు తెలిపే తీర్మానంపై న

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలను లక్ష్యంగా చేసుకుని సాగింది.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బ్యాంకులకు రూ.వేల కోట్ల ఎగవేతలు కాంగ్రెస్‌ పాపమేనన్నారు. అలాంటి దుష్ట విధానాలను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క పన్ను ఎగవేత జరిగిందా? అని ప్రశ్నించారు.
 
అంతేగాక అవినీతిపరులను జైలుకు పంపే విషయంలో రాజీలేదన్నారు. పన్ను ఎగవేతదారులకు మేం రుణాలు ఇవ్వలేదన్నారు. అలాగే.. మేం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నామని, విద్యుత్‌ ఉత్పత్తి, పొదుపుపై దృష్టిపెట్టామని, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలైన విద్యా, సొంతింటి కల నెరవేరుస్తున్నామని మోడీ గుర్తు చేశారు.
 
ఇకపోతే, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ‌... దళిత ముఖ్యమంత్రిని అవమానించారన్నారు. అలాగే, నీలం సంజీవరెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా సర్దార్ వల్లాభాయ్ పటేల్ అయివుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదన్నారు. అంతేకాకుండా, సరికొత్త విమానయాన పథకాలతో దేశానికి రెక్కలు తొడిగామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన విమానయాన విధానం తెచ్చామని నరేంద్ర మోడీ కితాబిచ్చారు.