సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (13:48 IST)

నౌషేరాలో మోదీ దీపావళి పండుగ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో నౌషేరా ప్రాంతానికి చేరుకున్నారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ సైనికులతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రతీ ఏడాది ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.
 
ఇదిలా ఉంటే గతేడాది, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ లోంగేవాలా ప్రాంతంలో ప్రధాని మోడీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుని ”భారత సైనికులు ఉన్నంత కాలం ఈ దేశంలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా, కాంతివంతంగా ఉంటాయని” ఆయన వివరించారు. ఇక 2019లో ఆయన రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొని నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణం చేశారు.