గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (14:12 IST)

బాలుడితో మద్యం, సిగరెట్ తాగించి ఉపాధ్యాయుడి లైంగిక దాడి

కర్ణాటక, యలందూర్ తాలూకాలోని ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్ హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలకు చదువుతున్న 17 ఏళ్ల గిరిజన బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి ఇంగ్లీష్ పరీక్షకు ముందు ఏప్రిల్ 5 రాత్రి ఈ సంఘటన జరిగింది. 
 
స్వలింగ సంపర్కుడైన టీచర్.. బాలుడితో మద్యం సేవించి, పొగ తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 
 
విద్యార్థుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఉపాధ్యాయుడిపై గతంలో జరిగిన దుర్వినియోగ కేసులపై విచారణ కొనసాగుతోంది. బాలుడికి కౌన్సెలింగ్ ఇప్పించడం జరిగింది.