గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (13:23 IST)

పువ్వులు లేని బొకే చూసి నవ్వుకున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi
Priyanka Gandhi
మధ్యప్రదేశ్ వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీకి పువ్వులు లేని బొకే చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. సభావేదికపై కాంగ్రెస్ నేత ఒకరు చేసిన పనికి నవ్వు ఆపుకోలేకపోయారు. 
 
వేదికపైకి వచ్చిన ప్రియాంక గాంధీని స్వాగతించే క్రమంలో పార్టీ స్థానిక లీడర్ దేవేంద్ర యాదవ్ ఆమెకు బొకే అందజేశారు. ఆ బొకేను చూసిన ప్రియాంక.. బొకేలో పువ్వులు లేకపోవడం చూసి ఇదేంటని అడుగుతూ నవ్వేశారు.
 
ఖాళీ బొకేను చూసిన మిగతా లీడర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.