గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (19:03 IST)

తమిళనాడులో వాహన అమ్మకాలపై నిషేధం

తమిళనాడులో కరోనా కేసులు ప్రతి రోజూ పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఆ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన అమ్మకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్ తెన్‌కాశి జవహర్ తెలిపారు. చెన్నై‌తో పాటు తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో చెన్నై సహా ఈ మూడు జిల్లాల్లోనూ వెహికిల్స్ అమ్మకాలపై నిషేధం విధించినట్టు తెలిపారు. అమ్మకాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

అలాగే, ఆర్టీవో, రవాణాశాఖ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు, షిఫ్టుల విధానంలో ఉద్యోగులు పని చేస్తారని ఆయన చెప్పారు. ఈ నాలుగు జిల్లాల్లో శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు సంపూర్ణ కర్ఫ్యూ విధించారు.