శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (22:03 IST)

ప్రొహిబిషన్ విధానంపై సిఎస్ సమీక్ష

రాష్ట్రంలో మద్యనిషేధం పటిష్ట అమలుకు, ఇసుక తవ్వకాల విధానంపై తీసుకోవల్సిన చర్యలపై మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇసుక తవ్వకం,మద్యం అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

ఇందుకై అమలు చేయాల్సిన నూతన విధానం ఇతర విధివిధానాలపై గనులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖల అధికారులతో ఆమె విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో డిజిపి గౌతం సవాంగ్, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.సాంబశివరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సురేంద్రబాబు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్, అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.