శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:29 IST)

చిలకలూరిపేటలో భగ్గుమంటున్న రాజకీయాలు

ఎమ్మెల్యే రజిని భర్త, తమ్ముడు విడుదల గోపిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారును వెంటాడి రాళ్లు రువ్విన దుండగులు, ముందుగానే తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో గాయాలతో తప్పించుకున్న గోపి, కారు ధ్వంసమైంది. 
 
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు, విద్యుత్ ప్రభల ఏర్పాట్లు చూసి వస్తున్నటువంటి సమయంలో, ఎడవల్లి గ్రామ పరిధిలో, ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. 
 
మొన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రోటోకాల్ లేకుండా ఎమ్మెల్యేకు చెప్పకుండా వస్తున్నారని కారును పురుషోత్తపట్నంలో అడ్డుకున్న రజనీ వర్గీయులు, ఇది మనసులో పెట్టుకున్న ఎంపీ తన వర్గాన్ని రెచ్చగొట్టినట్టు గోపి వర్గం ఆరోపిస్తున్నారు.