శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (09:18 IST)

మహిళా డాక్టర్‌ను చంపేసిన గాలిపటం దారం... ఎలా?

గాలిపటం (పతంగు) దారం ఓ మహిళా డాక్టర్ ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెలోని భోసరీ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ ఒక మహిళా డాక్టర్ ద్విచక్రవాహనంపై తాను పని చేసే ఆస్పత్రికి విధులకు హాజరయ్యేందుకు వెళుతోంది.
 
ఆ సమయంలో కొందరు చిన్నపిల్లలు గాలిపటాలను ఎగురవేస్తున్నారు. అలా ఓ గాలిపటం దారం (మాంఝె)ఆమె గొంతుకు చుట్టుకుంది. మెడకు దారం చుట్టుకున్న వెంటనే డాక్టర్ కింద పడిపోయారని, ఆమె మెడ నుంచి తీవ్ర రక్తస్రావమైందన్నారు. 
 
ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కాగా ఈ మహిళా డాక్టర్ పూణెలోని పింపల్ సౌదాగర్ ప్రాంతంలో ఉంటున్నారు.