గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (18:58 IST)

మరో వివాదంలో కేంద్ర మంత్రి: జర్నలిస్టుపై బూతులు తిడుతూ దాడి

కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. లఖీంపూర్ ఖేరీకి వచ్చిన సందర్భంగా అజయ్ మిశ్రా జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ జర్నలిస్టు లఖీంపూర్ కేసును ప్రస్తావిస్తూ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు సిట్ దర్యాప్తు విచారణ గురించి ప్రశ్న అడిగారు.
 
దీంతో సహనం కోల్పోయిన అజయ్ మిశ్రా.. ఆ విలేకరిని బూతులు తిట్టారు. మైకులు లాక్కొని జర్నలిస్టులపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్ ఖేరీలో నిరసనలు చేస్తున్న రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఐదు
Ajay Mishra
గురు అన్నదాతలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.