సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (10:11 IST)

ఆ మహిళా ఎస్సై‌తో శారీరక సంబంధం లేదు : రాయచూరు ఎమ్మెల్యే

ఓ మహిళా ఎస్సైతో శారీరక సంబంధం ఉన్నట్టు ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తలపై రాయచూరు ఎమ్మెల్యే తిప్పరాజు స్పందించారు. ఈ వివాహేతర సంబంధానికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆయన భార్య పేరుతో మార్చి 16న ఓ

ఓ మహిళా ఎస్సైతో శారీరక సంబంధం ఉన్నట్టు ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తలపై రాయచూరు ఎమ్మెల్యే తిప్పరాజు స్పందించారు. ఈ వివాహేతర సంబంధానికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆయన భార్య పేరుతో మార్చి 16న ఓ లేఖ కూడా అందింది. ఈ వ్యవహారం గురించి టీవీ చానళ్లలో సైతం కథనాలు వచ్చాయి. అయితే తాను ఆ లేఖ రాయలేదని ఎమ్మెల్యే భార్య తెలిపింది.
 
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే తిప్పరాజు స్పందించారు. తాను, తన భార్య అన్యోన్యంగా ఉన్నామని... కావాలనే తనపై ఎవరో బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయిపై విమర్శలు గుప్పించారు. తనతో చర్చించకుండానే, లేఖకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వివరించారని... రాజకీయపరంగా తనను తొక్కేయడానికి తన ప్రత్యర్థులు పన్నిన కుట్రగా అనుమానం కలుగుతోందని చెప్పారు.