సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:18 IST)

అంతు చిక్కని వ్యాధితో చిన్నారుల మృతి-మూర్చ, జ్వరంతో..?

రాజస్థాన్‌లో అంతు చిక్కని వ్యాధితో చిన్నారులు బలైపోతున్నారు. ఆరు రోజుల్లో ఏడుగురు చిన్నారులు ఈ అంతుచిక్కని వ్యాధికి మృతి చెందారు. వీరు వ్యాధి సోకిన కేవలం రెండు, మూడు గంటల్లో చనిపోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ జోగేశ్వర్ ప్రసాద్ తెలిపారు. మిగతా 10 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు 24 గంటల్లో మరణించినట్టు చెప్పారు.
 
రాజస్థాన్‌లో గిరిజన గ్రామం సిరోహి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బాధిత పిల్లలంతా మూర్ఛ, జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. 
 
సిరోహిలోని పిండ్వారా బ్లాక్‌లో ఉన్న ఫులాబాయి ఖేరా గ్రామానికి జైపూర్, జోధ్‌పూర్ నుంచి ప్రత్యేక బృందాలను పంపించారు. ఈ బృంద సభ్యులు సిరోహి జిల్లాలకు చేరుకుని పిల్లల మరణాలకు గల కారణాలు, మిస్టరీ వ్యాధి గురించి పరిశోధనలు జరుపుతున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పంపారు.