సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (13:58 IST)

రజనీ కొత్త పార్టీపై 2 వారాల్లోపు ప్రకటన.. అంతా సిద్ధం: తమిళరువి మణియన్

తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఉతికి ఆరేస్తుంటే.. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీపై త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఒక

తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఉతికి ఆరేస్తుంటే.. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీపై త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్న విషయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన రాకను రజనీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు.
 
అయితే తమిళనాడు సీఎం పళనిసామి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తమిళ హీరోలపై సెటైర్లు వేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం కాదు ముందుగా ప్రజాసేవ చేయాలని చురకలంటించారు. సచివాలయంలో కూర్చోవాలనుకునే వారు ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. 
 
ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చే సమయం వచ్చేసిందంటూ గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్ అన్నారు. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 
 
రెండు వారాల్లోగా రజనీకాంత్ రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవలే దీనిపై రజనీకాంత్‌తో సమావేశం అయ్యానని... ఆయన మాటల్ని బట్టి త్వరలోనే రాజకీయాల్లోకి  వస్తారనే విషయం అర్థమైపోయిందన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో కాదని.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు తనకు చేతనైన మేలు చేయాలనే ఉద్దేశంతోనేనని ఆమె చెప్పుకొచ్చారు.