మామ అత్యాచారం చేస్తే... భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు...
ఓ మహిళా కానిస్టేబుల్ మామ చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ విషయం తెలిసిన భర్త... ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను వదిలించుకున్నాడు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికంగా ఓ స్టేషనులో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. ఆమెపై భర్త లేని సమయంలో మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఈ విషయం భర్తకు చెబితే ఆదుకోవాల్సిన అతడు ఏకంగా ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
ఈ ఘటనలో బాధితురాలు సహా ఆమె భర్త, మామ.. ముగ్గురూ పోలీసు అధికారులే కావడం విశేషం. బాధితురాలు స్థానిక పోలీసుస్టేషన్లో మహిళా కానిస్టేబుల్. బుధవారం రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మామ అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది.
బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. ఇదే అదనుగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు