గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 23 జూన్ 2021 (21:20 IST)

భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసిన శాడిస్ట్ భర్త, ఆ తర్వాత?

భర్త అంటే భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వందేళ్ళు ఆమెతో అన్యోన్యంగా కలిసి ఉండాలి. ఆమెకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు. అది దాంపత్య జీవితం అంటే. అయితే ఈ భర్త వెరైటీ. లాక్‌ డౌన్లో ఖాళీగా ఉంటూ బోరు కొట్టేస్తోందంటూ ఏకంగా భార్యని నగ్నంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను చూసుకుంటూ ఆనందం పొందేవాడు.
 
పుణేలో ఒక మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్ళి భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త తనను మానసికంగా హింసిస్తున్నాడని తెలిపింది. అంతేకాదు తను స్నానం చేస్తుండగా వీడియోలను తీసి ఆ వీడియోలను చూస్తున్నాడని.. పోర్న్ వీడియోలను చూస్తున్నాడని ఫిర్యాదు చేసింది. 
 
మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె చెప్పినట్లుగానే నగ్న వీడియోలు బయటపడ్డాయి. గత వారంరోజుల నుంచి తీసిన నగ్న వీడియోలను భద్రంగా దాచుకున్నాడట. మహిళా కానిస్టేబుళ్ళు ఎందుకు ఈ వీడియోలను తీశావని అడిగితే నా భార్య ఉద్యోగానికి వెళుతుంది.. నాకు ఇంట్లో బోర్ కొడుతోంది.
 
అందుకే స్నానం చేసే వీడియోలను తీసి పెట్టుకున్నాను. ఆ వీడియోలను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. నాకు టైం పాస్ బాగా అవుతుందని చెప్పాడట భర్త. దీంతో పోలీసులే అవాక్కయ్యారట. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.