శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:39 IST)

విద్యార్థిని రేప్ చేసి చెట్టుకు ఉరి వేసి కాల్చారు... హృదయం బద్ధలైందన్న రష్మిక

కర్నాటకలోని రాయచూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి, ఆమెను చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టి కాల్చిన దారుణ ఘటనపై ఎంతోమంది తమ బాధను, ఆవేదనను, ఆక్రందన వెలిబుచ్చారు. నిందితులను పట్టుకుని తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హీరోయిన్ రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
రష్మిక ట్విట్టర్లో పేర్కొంటూ... ‘మానవత్వం ఎక్కడకు పోయింది? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధుపై అత్యాచారం చేసి ఆమెను దారణంగా హత్య చేశారు. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటి వాటికి అంతంలేదా? ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముగింపు ఉండాలి... అంటూ వెల్లడించింది.