మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:08 IST)

మా అన్న భారతీయుడే.. ఎనీ డౌట్స్ : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర హోం శాఖ జారీచేసిన నోటీసుపై ఏఐసీసీ యూపీ తూర్పు విభాగ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. రాహుల్ భారతీయుడేనా అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతుండటంపై ఆమె మండిపడ్డారు. తన సోదరుడిపై చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 
 
'రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసు. ఆయన ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఆయనపై కట్టుకథలు అల్లుతున్నారు. అదంతా నాన్సెన్స్' అని ప్రియాంకా గాంధీ తెలిపారు.
 
విదేశీ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోమంత్రిత్వ శాఖ తాజాగా నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు రాహుల్ నుంచి వివరణ కోరింది. 15 రోజుల్లోగా కాంగ్రెస్ చీఫ్ సమాధానం చెప్పాలని ఆదేశించింది.