ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:46 IST)

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల ప్రభావం రైల్వే శాఖపై పడటంతో పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

రైళ్ల రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు పట్టాలపై వర్షపు నీళ్లు నిలిచిపోవడం, ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు జలమయమవ్వడం, పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి సమస్యలు చోటుచేసుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్‌ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి.

సౌత్‌ సెంట్రల్‌, సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ వెస్ట్‌ రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల రూట్‌ మార్చారు. ఇంకొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
 
ట్వీట్‌ ద్వారా ప్రకటన...
సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ వెస్ట్‌ రైల్వే ఒక ప్రకటన విడుదల చేశాయి. రద్దయిన, దారిమళ్లించిన, తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడిస్తూ.. ట్వీట్‌ చేశాయి.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో మొత్తం 14 రైళ్లను రద్దు చేయగా.. సౌత్‌ వెస్ట్‌ రైల్వే 15 రైలు సర్వీసులను రద్దు చేశారు. మూడు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో 16 రైళ్లను దారి మళ్లించారు. సెంట్రల్‌ రైల్వే 50 రైళ్లను రద్దు చేసింది.