గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 12 జులై 2018 (18:29 IST)

అతడు ఉరి వేసుకుంటుంటే 2,750 మంది చూస్తూ వున్నారు... కానీ ఎవ్వరూ ఆపలేదు...

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తూ దారుణాలకు ఒడిగట్టడం ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి తను ఉరి వేసుకుంటున్నట్లు చెప్పాడు. అతడు ఆ పనికి పూనుకుంటూ ఉరి తాడును మెడకు తగిలించుకుంటూ చేస్తున్న పనులన్నిటినీ సుమారు 2750

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తూ దారుణాలకు ఒడిగట్టడం ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి తను ఉరి వేసుకుంటున్నట్లు చెప్పాడు. అతడు ఆ పనికి పూనుకుంటూ ఉరి తాడును మెడకు తగిలించుకుంటూ చేస్తున్న పనులన్నిటినీ సుమారు 2750 మంది చూస్తూ వున్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ అతడి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు యత్నించలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం చేరవేయలేదు. దానితో అతడు వాళ్లంతా చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... అతడికి భారత సైన్యంలో చేరాలన్నది కల. అయితే అతడు ఇప్పటికి ఆరుసార్లు ప్రయత్నించినా తన కల నెలవేరలేదు. భరత మాతకు సేవ చేసే భాగ్యం కలుగనందుకు మానసిక వ్యధకు గురయ్యాడు. 
 
తనకు భగత్ సింగ్ స్ఫూర్తి అనీ, భరత మాతకు సేవ చేసే భాగ్యం కలుగని తను ఇక బతికి సాధించేదేమి లేదని అతని పేరెంట్స్ వద్ద ఆవేదన చెందుతూ వచ్చాడు. దీనితో అతడి మనోవ్యధ నుంచి బయటకు రప్పించేందుకు తండ్రి ఓ షాపును కూడా పెట్టించాడు. కానీ అవేమీ అతడిని ఒత్తిడి నుంచి బయటకు తీసుకు రాలేకపోయాయి. దీనితో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.